సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు
పొందుగ( జక్రాంకితమే బుజబల మిదే నాకు అందినహరి నీచింతే ఆత్మబలము నాకు సందడి( బేరుబలము కేశవనామము నాకు యిందును నందును భవభయ మిక లేదిదే నాకు
అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు
కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు
Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com